ప్రధాని మోదీ ఢిల్లీ కర్తవ్య పథ్ ను ప్రారంభించారు. ఇండియా గేట్ దగ్గర 28 అడుగుల నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా.. కర్తవ్యపథ్ నిర్మాణంలో పాల్గొన్న కార్మికులను కలిశారు. అద్భుతంగా కర్తవ్య పథ్ ను తీర్చిదిద్దారని వారిని ప్రశంసించారు. అనంతరం కర్తవ్య పథ్ పై ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.
ఏటా గణతంత్ర దినోత్సవాన దేశ సైనికశక్తి ప్రదర్శనకు వేదికగా నిలిచే రాజ్‌పథ్ పేరు మారిపోయింది. అంతకుముందు కర్తవ్యపథ్‌గా మార్చాలన్న ప్రతిపాదనకు దిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి.. అధ్యక్షతన జరిగిన దిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఇండియా గేట్ వద్ద ఉన్న నేతాజీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న మార్గాన్ని ఇకపై కర్తవ్యపథ్‌గా పిలుస్తారు. వలసవాద విధానాలు, చిహ్నాలు మార్చాలన్న విధానం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి మీనాక్షి లేఖి తెలిపారు. బ్రిటిష్‌వారి కాలంలో కింగ్స్‌వే అని పిలవగా స్వాతంత్ర్యం తర్వాత రాజ్‌పథ్‌గా నామకరణం చేశారు. ఇప్పుడు కర్తవ్యపథ్‌గా మారింది.