అమరావతి పరిధిలోని 22 గ్రామాలతో అమరావతి మునిసిపాలిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తుళ్లూరు, మంగళగిరి మండలాల పరిధిలోని 22 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను సేకరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్కు ఏపీ పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు గ్రామ సభల కోసం కలెక్టర్ నోటీసులు జారీ చేశారు.