బ్రిటన్ రాణి ఎలిజబెత్-II అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె స్కాట్లాండ్ లోని ఆమె నివాసం బల్మోరల్ కోటలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు బకింగ్ హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపింది. "ఇవాళ ఉదయం ఎలిజబెత్-II ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన తర్వాత ఆమె ఆరోగ్యం పై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు" అని బకింగ్ హామ్ ప్యాలెస్ పేర్కొంది.