టీడీపీ నేత నారా లోకేశ్ పై మంత్రి మేరుగు నాగార్జున తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ చెబితే మంత్రులను మార్చాలా అని మండిపడ్డారు. ఆయన వైసీపీ నేతలు, కార్యకర్తలను ఎలా దూషిస్తారని ప్రశ్నించారు. లోకేశ్ నోటి వెంట బూతు మాటలు వస్తే నాలుక కోస్తామని వార్నింగ్ ఇచ్చారు. పరిపాలనలో భాగంగా ఎలాంటి మార్పులైనా చేసుకునే అధికారం సీఎం జగన్ కు ఉందన్నారు.