డీఆర్డీవో రూపొందించిన క్యూఆర్ సామ్ మిస్సైల్ ప్రయోగం విజయవంతమైంది. ఇప్పటికి ఆరుసార్లు ఈ ప్రయోగం నిర్వహించగా అన్ని సార్లు టార్గెట్ ను రీచ్ అయ్యింది. త్వరలోనే దీన్ని భారత సైన్యంలో చేర్చనున్నారు. దీన్ని కదులుతున్న వాహనం నుంచి కూడా ప్రయోగించవచ్చు. గగనతలంలో వేగంగా కదిలే లక్ష్యాలను ఛేదించడంలో క్యూఆర్ సామ్ ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని భావిస్తున్నారు.