ఆర్బీకేల పరిధిలో యంత్రసేవ కింద ఇస్తున్న పరికరాలు, యంత్రాలు అన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అగ్రి ఇన్‌ఫ్రా, ధాన్యం సేకరణపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. చిత్తూరు డెయిరీని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని చెప్పారు. చేయూత ద్వారా స్వయం ఉపాధి పథకాలు కొనసాగించాలన్నారు.