కుప్పం బైపాస్ రోడ్డుకే పరిమితమైన ప్రైవేటు బస్సులు గత కొన్నిరోజులుగా పట్టణంలోకి ప్రవేశిస్తూ ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్నాయని గురువారం కుప్పం ఆర్టీసి డిపో మేనేజర్ స్వామి పేర్కొన్నారు. బస్టాండు కూడలిలో నిలిపిన ఉన్న ప్రైవేటు బస్సుల ఎదుట ఆర్టీసి డిఎం సిబ్బందితో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ప్రైవేటు బస్సులు పట్టణంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ సురేష్ బాబు, అర్బన్ సీఐ శ్రీధర్ కు వినతి ఇచ్చినట్లు ఆయన తెలిపారు.