కర్ణాటకలో దారుణం జరిగింది. మద్యం మత్తులో బస్సు ఎక్కిన ప్రయాణికుడిని ఆర్టీసీ బస్సు కండక్టర్ కాలితో తన్ని బయటకు నెట్టేశాడు. ఈ ఘటన దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు సమీపంలోని ఈశ్వరమంగళలో బుధవారం జరిగింది. ఈ విషయం ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో కండక్టర్ సుబ్బరాజ్ ను సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa