శింగనమల మండల కేంద్రంలోని రంగరాయల చెరువు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు అనంతపురం ఆర్డీఓ మధుసూదన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆర్డీఓ మాట్లాడుతూ వరవ నీటిలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు తెలియజేశారు. ప్రజలెవరూ కూడా చెరువు ప్రాంతాలకు వెళ్ళకూడదని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa