ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రైవేట్ బస్సు బోల్తా ఐదు మందికి గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 09, 2022, 01:21 PM

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లి గ్రామ సమీపంలోని కడప అమరావతి రాష్ట్రీయ రహదారిపై శుక్రవారం ప్రవేటు బస్సు బోల్తా పడిన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదు మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని 108 వాహనంలో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు దైవదర్శనం నిమిత్తం కాశినాయన మండలం కేసినేనిపల్లి నుంచి భద్రాచలం వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa