ఎన్సీసి లో చేరడం ద్వారా విద్యార్థి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని పొందుతారని 23 ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్, కల్నల్ సునీల్ గౌతం పేర్కొన్నారు. శుక్రవారం చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్సీసీ విద్యార్థులకు బి సర్టిఫికెట్ల ప్రధాన ఉత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సునీల్ గౌతం మాట్లాడుతూ ఎన్సిసి లో క్రమశిక్షణ, అంకితభావం, కష్టపడే తత్వం, నాయకత్వ లక్షణాలు అలవాడతాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa