తాను చనిపోయినట్లు రికార్డుల్లో పేర్కొని, పింఛను నిలిపేసిన అధికారులకు ఓ వృద్ధుడు షాకిచ్చాడు. పెళ్లి కొడుకు వేషంలో ఊరేగింపుగా వచ్చి నిరసన చేపట్టాడు. హర్యానాలోని రోహ్‌తక్ జిల్లాకు చెందిన దూలీ చంద్ వయసు 102 ఏళ్లు. ఈ ఏడాది ప్రారంభంలో అతడి పింఛనును అధికారులు ఆపేశారు. దానిపై తాజాగా దూలీ చంద్ నిరసన చేపట్టారు. తాను బ్రతికే ఉన్నానని, తన పింఛను పునరుద్ధరించాలని అధికారులకు మెమోరాండం అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa