ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతర్రాష్ట్ర బదిలీల్లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బదిలీల కోసం పలువురు ఉద్యోగులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఆ విధంగా ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. తెలంగాణ నుంచి కూడా అనుమతి వస్తేనే బదిలీలు జరుగుతాయి. దీంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa