ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అవినీతి చేశానని ఎవరైనా నిరూపిస్తే వాళ్ల కాళ్లు పట్టుకోవడానికి సిద్ధమని ప్రకటించారు. తనపై కుట్ర అంతా గంగాధర నెల్లూరు మండలంలోనే జరుగుతోందని స్పష్టం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వాళ్లు పార్టీని వదిలి పోవాలని సూచించారు.