ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్నట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు. సమావేశంలో ప్రవేశపెట్టే బిల్లుల వివరాలను ఈనెల 12వ తేదీలోగా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపాలంటూ సీఎంవో ప్రత్యేక కార్యదర్శి కెఎస్. జవహర్‌రెడ్డి అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. కాగా అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనేది అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయించనున్నారు. చివరిసారిగా జులై 19 నుంచి ఐదురోజుల పాటు సమావేశాలు జరిగాయి.