యూపీలోని కన్నౌజ్ జిల్లా సదర్ కొత్వాలి గ్రామంలో శుక్రవారం అమానుష ఘటన జరిగింది. గ్రామంలో వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు. సన్నీ గౌతమ్ అనే దళిత బాలుడు ఆడుకుంటూ వెళ్లి, వినాయక ప్రతిమ పాదాలను తాకాడు. ఇది చూసిన మండపం నిర్వాహకుడు బబ్బన్ గుప్తా కోపంతో రగిలిపోయాడు. తన కుమారులతో కలిసి ఆ బాలుడిని దారుణంగా కొట్టాడు. దీనిపై బాధిత బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.