పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే జస్వంత్ సింగ్ గజ్జన్ మజ్రా ఇళ్లు, కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం దాడులు చేసింది. ఎమ్మెల్యే ఇంట్లో లభించిన రూ.32 లక్షలు, హార్డ్ డ్రైవ్‌లను స్వాధీనం చేసుకుంది. బ్యాంకు నుంచి రుణాలు పొందేందుకు బోగస్ సంస్థల ద్వారా సంస్థ టర్నోవర్‌ను తారా కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ పెంచి చూపించిందని ఈడీ పేర్కొంది. ఈ కేసులో ఎమ్మెల్యేపై అభియోగాలు ఉన్నాయని తెలిపింది.