2016 కృష్ణా పుష్కరాల సమయంలో తాడేపల్లి పట్టణం సీతానగరంలో ఇళ్ళు తొలగించిన పేదలకు వెంటనే స్థలాలు కేటాయించి పక్కా గృహాలు నిర్మించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు డిమాండ్ చేశారు. తాడేపల్లి బోటుయార్డు వద్ద తాత్కాలికంగా నివాసం ఉంటున్న పుష్కర కాలనీని రామారావు శుక్రవారం సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మూడు నెలల్లో ఇళ్లు ఇస్తామని అధికారులు హామీ పత్రాలు ఇచ్చి నేటికీ బాధితులకు గృహాలను ఇవ్వలేదని అన్నారు. అధికారులు, ప్రభుత్వం స్పందించి గృహాలు మంజూరు చేయాలని లేదంటే ఉద్యమం ఉదృతం చేస్తామని చెప్పారు.