భారత టెస్టు జట్టులో స్థానాన్ని కోల్పోయిన అజింక్య రహానే దేశవాళీ సీజన్‌ను ఘనంగా ప్రారంభించాడు. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో వెస్ట్‌జోన్ బ్యాటర్ రహానే (264 బంతుల్లో 207 బ్యాటింగ్; 18 ఫోర్లు, 6 సిక్స్‌లు) డబుల్ సెంచరీతో సత్తా చాటాడు.
అతనికి తోడు యశస్వి జైస్వాల్ (321 బంతుల్లో 228; 22 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా ద్విశతకం బాదడం విశేషం. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సరికి వెస్ట్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 590 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా (121 బంతుల్లో 113; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) కూడా శతకం సాధించాడు. బలమైన వెస్ట్‌జోన్ బ్యాటింగ్ లైనప్ ముందు అనామక జట్టుగా నార్త్ ఈస్ట్ తేలిపోయింది.