భూమి కుంగిన బాధిత రైతుకు నష్టపరిహారం చెల్లించాలని ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దస్తగిరి రెడ్డి డిమాండ్ చేశారు, శుక్రవారం చింతకొమ్మదిన్నె మండలంలోని బైనపల్లెకు చెందిన జనార్దన్‌రెడ్డి పసుపు పొలంలో ఉన్నఫలంగా భూమి కుంగి పోయిందని, త ద్వారా నష్టం వాటిల్లిందని కుంగిన భూమిని చదును చేయాలంటే ఖర్చుతో కూడకున్న పని అని అన్నారు. రైతుకు పరిహారం ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
గతంలోనూ బలిజపల్లె, ముసలిరెడ్డిపల్లె, నాగిరెడ్డిపల్లె తదితర గ్రామాల్లో గుంతలు ఏర్పడ్డాయని ఆయన తెలిపారు, పొలంలో పనులు చేసుకోవాలంటే ఎక్కడ ఏ గుంత పడుతుందో రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆయన వాపోయారు. జిల్లా ఉన్నతాధికారులు భూగర్భ పరిశోధన అధికారులతో సర్వేలు చేయించి గ్రామస్తులకు వాస్తవాలు తెలియజేయాలని ఆయన కోరారు. రైతులకు నష్టపరిహారం వచ్చే విధంగా మండల తహశీల్దార్, వ్యవసాయాధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపాలని ఆయన కోరారు.