ప్రొద్దుటూరు స్థానిక వైఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజి ఈసీఈ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి సాంకేతిక సదస్సు శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిధిగా యోగివేమన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ దుబ్బాక విజయరాఘవప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎలక్ట్రానిక్ విభాగంలో నైపుణ్యం సాధించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు వివిధ ఎలక్ట్రానిక్ అంశాలపై ప్రాజెక్టులను, పోస్టర్లను, ఆర్టికల్స్ ను సమర్పించారు. క్విజ్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నాగరాజు, ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ కేవీ రమణయ్య, ప్రొఫెసర్ షఫీవుల్లా బాషా, ప్రొఫెసర్ సంతోష్ కుమార్ పాల్గొన్నారు.