నంద్యాలంపేటలోని సర్వే నంబర్ 506/బి, 507లో మైదుకూరు ఎంఎల్‌ఎ రఘురామిరెడ్డి అనుచరులు మూడు ఎకరాలకుపైగా ప్రభుత్వ అటవీ భూములను ఆక్రమించారని టిడిపి ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ ఆరోపించారు. శుక్రవారం కడప నగరంలో ని జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వేల ఎకరాల భూములను వైసిపి, ఎమ్మెల్యే అనుచరులు ఆక్రమించుకున్నారని తెలిపారు. ఆక్రమించిన అటవీ భూములపై చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆ భూమిపై కోర్టుకు తప్పుడు నివేదికను రెవెన్యూ, అటవీశాఖాధికారులు అందజేశారని విమర్శించారు.
ఫారెస్ట్ భూమి ఇచ్చే అధికారం రెవెన్యూ అధికారులకు లేదన్నారు. ఆ భూములను ఆరు నెలలలోపు స్వాధీనం చేసుకోవాలని ఎన్‌జిటి ఆదేశించిందని పేర్కొన్నారు. తమ ఆరోపణలలో న్యాయం ఉందని గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుతో వెల్లడైందన్నారు. అధికారులు తీరు మార్చుకోపోతే న్యాయ స్థానాన్ని ఆశ్రయించి ఇంటికి పంపక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో టిడిపి జిల్లా అధ్యక్షులు లింగారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు గోవర్ధన్ రెడ్డి, హరిప్రసాద్, బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాంప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి హరి పాల్గొన్నారు.