ఏపీ సర్కారు అమలు చేస్తున్న 'జగనన్న చేదోడు' పథకం ద్వారా అర్హులైన వారికి ఏటా రూ.10 వేల సాయం అందుతోంది. 60 ఏళ్ల వయసు దాటని అన్ని కులాలకు చెందిన టైలర్లు, బీసీ వర్గానికి చెందిన రజకులు, నాయీబ్రాహ్మణులు ఈ పథకానికి అర్హులు. అయితే కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ పెన్షనర్, ఆదాయపన్ను చెల్లించే వారు, ఫోర్ వీలర్ కలిగి ఉన్న వారు అనర్హులు. ఇంటి విస్తీర్ణం, కుటుంబ ఆదాయం పరిగణనలోకి తీసుకుంటారు.