కేటుగాళ్ల వలలో చిక్కి ముంబైకి చెందిన 54 ఏళ్ల వృద్ధుడు డబ్బులు పోగొట్టుకున్నాడు. భార్య చనిపోవడంతో పిల్లల వద్ద ఉంటున్న అతడికి ఫేస్బుక్లో ప్రియాంక జైన్ అనే యువతి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. ఆమె అడిగిందని న్యూడ్ కాల్ చేశాడు. అది అడ్డం పెట్టుకుని అవతలి వ్యక్తులు రూ.30 వేలు గుంజారు. మరో రూ.5 లక్షల కోసం డిమాండ్ చేయగా, పిల్లల సాయంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.