ఏపీలో ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నది మా ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. ప్రభుత్వం అంటే ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు వేరు కాదన్నారు. అందుబాటులో ఉన్న అవకాశాల మేరకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించామని చెప్పారు. పీఆర్సీ అందులో ఒక్కటని అన్నారు.