ప్రజల సహకారంతోనే సీజనల్ వ్యాధులకు దూరం కాగలమని కమిషనర్ నడిపేన రామారావు శనివారం అన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు అవకాశం ఎక్కువగా ఉన్నందున విష జ్వరాలు డెంగి మలేరియా అతిసారం గనియ తదితర వ్యాధుల బారిన పడకుండా ఎవరికి వారే స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలంతా ఇంటి లోపల వెలుపల చెత్త లేకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చూడాలని, వారానికి ఒకసారి నీటి తొట్టెలను శుభ్రం చేసి మరుసటి రోజున నింపి వాడుకోవాలని, దోమతెరలను వాడాలని, ఇంటి కిటికీలకు దోమలు రాకుండా మిషన్ అమర్చుకోవాలన్నారు. పనికిరాని కొబ్బరి చిప్పలు రుబ్బురోలు మూత లేకుండా ట్యాంకులు ఉంచకూడదన్నారు.
టైర్లలో నీరు నిలవ లేకుండా చూసుకోవాలన్నారు. కూలర్లు ఫ్రిజ్లలో నీరు నిల్వ ఉండకుండా చూడడం ద్వారా దోమల లార్వా పెరగకుండా మురుగు లేకుండా చూడాలన్నారు. మీరు ఆహారం కలుషితంతో టైఫాయిడ్ అధికారం వ్యాధులు వస్తాయని కనుక ప్రజలు అప్రమత్తత వ్యవహరించి సీజనల్ వ్యాధులకు గురికాకుండా కాచిన మంచినీటినే త్రాగి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ప్రతి శుక్రవారం డ్రైడేన్ పాటిస్తూ పట్టణ ప్రజారోగ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. దోమల నియంత్రణలో థెమీఫాస్, బి. టి. ఐ పౌడర్ డెఫ్లూ బెంజ్ యురాన్ మొదలగు మందులను పట్టణములో ఉన్న ఓపెన్ డ్రెయిన్స్ లలో స్ప్రేయింగ్ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ముమరంగా చేపట్టాలన్నారు. పట్టణమంతా ఒక ప్రణాళికా బద్దంగా దోమల నియంత్రణకు ఇప్పటిలాగే ప్రతిరోజూ కూడా ఫాగింగ్ చేయించాలన్నారు.
పట్టణములో నీరు ఎక్కడా నిలిచిపోకుండా వెనువెంటనే చర్యలు చేపట్టాలని, ఎక్కడైనా నిలువ ఉండే ప్రాంతాలలో ఆయిల్ బాల్స్ వేయడం ద్వారా క్రిమి కీటకాలు చేరకుండా చూడాలన్నారు. నిల్వనీటి గుంతలు, మురుగు నీటి కాలువల్లో నివసించే దోమల గుడ్లను సుమారు 300 వరకు తినే గంబుషియా చేపలను వదలాలన్నారు. గంబుషియా చేపలను మరోమారు విజయనగరం మత్స్యశాఖ నుండి తెప్పించేందుకై చర్యలు చేపట్టామని కమీషనర్ వారు తెలియజేశారు.
ఈ గంబుషియా చేపలు దోమల గుడ్లను, లార్వాలనే కాకుండా చిన్న చిన్న కీటకాలను కూడా తిని జీవిస్థాయని, ఒక్కో చేప రోజుకు 100నుండి 300 లార్వాలను ఆహారంగా తీసుకుని దోమల సంతతి నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. మలేరియా డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు ముఖ్యంగా ఎక్కువ కాలం నీటి నిల్వ ఉండే పాత్రలు, డ్రమ్ములు, తొట్టెలలో నీటిని ఎప్పటికప్పుడు మార్చాలన్నారు. ప్రతి ఇంటినీ సమగ్రంగా సర్వే చేసి ట్యాంకుల్లోనూ, నీళ్ళ తొట్టెలు, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో తోక పురుగులు నివారణ మందులు చల్లాలని, శానిటేషన్ సిబ్బంది మరియు వైద్య సిబ్బంది జిల్లా మలేరియా సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ సీజనల్ వ్యాధులు పట్టణంలో ప్రబలకుండా ఉండేటట్లు ప్రజలను చైతన్య పరుస్తూ ఉండాలని సూచించారు.