శ్రీకాళహస్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఈనెల 11వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. తిరుపతికి చెందిన వెంకటరమణ ఆసుపత్రి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బీపీ, షుగర్‌తో పాటు గుండె సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయనున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది.