చిత్తూరు: కురబలకోట అంగళ్లు పంచాయతీ తుంగావారిపల్లిలో శనివారం రాత్రి భార్య మీద కోపంతో భర్త పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ముదివేడు పోలీసుల కథనం మేరకు మురారి కుమారుడు గోపాల్(30) తన భార్య భాగ్యమ్మతో గొడవపడి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. స్థానికులు గమనించి అతనిని మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.