చిత్తూరు: పిటిఎం కందుకూరు పంచాయతీ నిలువరాతి పల్లి రాజేష్ భార్య మంజుల(30) భర్త తలనొప్పికి మాత్ర తెలేదని కోపంతో శనివారం రాత్రి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు బాధితురాలిని 108 వాహనంలో మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. ప్రథమ చికిత్సల అనంతరం ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తిరుపతికి రిఫర్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.