కుప్పం పట్టణంలోని ఐఆర్ఎం డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన జాబ్ మేళాకు వివిధ ప్రాంతాల నుంచి హాజరైన అభ్యర్థులకు విస్త్రోన్ కంపెనీ ప్రతినిధులు ముఖాముఖి నిర్వహించారు. కంపెనీలలో వివిధ శాఖలలో పనిచేయడానికి 487 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినట్లు కళాశాల ఛైర్మన్ దయానిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో ఇప్పటికే పలుసార్లు జాబ్ మేళాకు విశేష స్పందన రావడంతో నిరుద్యోగులు అధిక సంఖ్యలో జాబ్ మేళాకు హాజరు అయ్యారని ఆయన తెలియచేశారు.