చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వి. కోట మండలంలోని యర్రిగానేపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బాలవర్ధన్ తండ్రి మునస్వామి, కుమారుడు వెంకట్ అనారోగ్యంతో పీఈఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఎన్. వెంకటే గౌడ శనివారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య విషయాలపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.