కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని పలమనేరు క్రిష్ణగిరి జాతీయ రహదారి సామగుట్టపల్లె వద్ద రెండు ద్విచక్ర వాహనాలు శనివారం ఢీకొనడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి. బాధితులను కుప్పం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి 108 అంబులెన్స్ ద్వారా తరలించారు. స్థానిక కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుడుపల్లె మండలం బెగ్గిలిపల్లెకు చెందిన మురుగన్, తులసీ ద్విచక్ర వాహనంపై కుప్పం వైపు వస్తుండగా, సామగుట్టపల్లెకు చెందిన పవనకుమార్ ద్విచక్ర వాహనంపై పీఈయస్ ఆస్పత్రికి వెళ్తూ ఎదురెదురుగా ఢీకొన్నారు. తులసికి తీవ్రగాయాలు కావడంతో మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం పీఈయస్ ఆస్పత్రికి తరలించారు.