వంటింటిలో లభించే పదార్థాలతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. చాలా మందికి వాటితో లాభాలు తెలియక పెదవి విరుస్తుంటారు. అయితే సులువుగా బరువు తగ్గేందుకు, మధమేహం, ఆర్థరైటిస్ వంటి వ్యాధులను దూరం చేసేందుకు ఇవి దోహదం చేస్తాయి. నల్ల జీలకర్రగా మన వంటింట్లో ఉండే దీని ప్రయోజనాలు తెలుసుకుందాం.
నల్ల జీలకర్రకు ఎంతో పురాతన చరిత్ర ఉంది. ఈజిప్ట్‌లోని టుటన్‌ఖామున్ సమాధిని పురావస్తు శాస్త్రవేత్తలు కొన్నేళ్ల క్రితం తవ్వారు. అందులో కలోంజీ విత్తనాలను ఉన్నట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. దీంతో కలోంజీ విత్తనాల వల్ల లాభాలను శతాబ్ధాల క్రితమే పూర్వీకులు ఉపయోగించారని తెలుసుకున్నారు. ఇక భారత దేశంలో వీటిని సుగంధ ద్రవ్యాలుగా, వైద్య మూలికలుగా కూడా ఉపయోగిస్తుంటారు. ఇందులో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఐరన్, ఫైబర్, పొటాషియం, కాల్షియం, విటమిన్ ఎ, సి, బి, బి12 వంటివి మెండుగా ఉంటాయి. కడుపులో నులిపురుగుల నివారణకు ఉపయోగపడతాయి. డయాబెటిస్‌ను నియంత్రణకు, కంటి సమస్యల, గుండె సమస్యలను దూరం చేయడానికి దోహదం చేస్తాయి. చర్మం మిలమిలా మెరిసేందుకు అవి దోహదం చేస్తాయి.