కొన్ని రకాల డ్రింక్స్ దంతాలను పాడు చేస్తాయి. సాధారణంగా పళ్ల రసాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ నారింజ, ద్రాక్ష, నిమ్మ వంటి సిట్రస్ జాతి పళ్ల రసాల్లో యాసిడ్ లక్షణాలు ఎక్కువగా ఉండటంతో వీటికి దంతాలను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని స్ట్రాతో తాగడం మంచిది. అలాగే స్పోర్ట్స్ డ్రింకులు, ఎనర్జీ డ్రింకులల్లో కృత్రిమ రంగులు కలపడం వల్ల అవి దంతాలకు హాని చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.