తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీ శ్రీనివాసపురంలో శనివారం రేషన్ బియ్యం పంపిణీ చేసే వేయింగ్ ను చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్కు గురై యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం పద్మావతీపురానికి చెందిన శివశంకర్ (19) ప్రభుత్వ రేషన్ బియ్యం పంపిణీ చేసే వాహనం ఆపరేటర్ కు అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. శనివారం డ్రైవరు సుబ్బారావుతో కలిసి శ్రీనివాసపురంలోని భానుమతి చౌకదుకాణం వద్దకు వెళ్లారు.
అక్కడ వేయింగ్ మెషిన్ కు చార్జింగ్ పెడుతుండగా శివశంకర్ విద్యుత్ షాక్ కు గురయ్యాడు. వెంటనే రుయాకు తరలించగా పరిశీలించిన వైద్యులు అతను అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.