రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్ శుభారంభం చేసింది. దక్షిణాఫ్రికా దిగ్గజాలపై ఘన విజయం. రహదారి ప్రమాదాల గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో భారత రోడ్డు రవాణా, రహదారులు మరియు ఐటీ మంత్రిత్వ శాఖ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ - 2022 సీజన్‌ను నిర్వహిస్తోంది. ఇప్పటికే ఒక సీజన్ పూర్తి చేసుకున్న ఈ టోర్నీ మళ్లీ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్ రెండో సీజన్‌లో భారత లెజెండ్స్ జట్టుకు సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. భారత దిగ్గజాలతో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌లకు చెందిన దిగ్గజ జట్లు బరిలోకి దిగాయి. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ కాన్పూర్ వేదికగా జరిగింది. భారత్ దిగ్గజాలు, దక్షిణాఫ్రికా దిగ్గజాలు తలపడ్డారు. ఇక భారత దిగ్గజం ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ (42 బంతుల్లో 82 పరుగులు, 5 ఫోర్లు, 6 సిక్సర్లు నాటౌట్) చెలరేగి ఆడాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 217 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత ఆదుకున్న దక్షిణాఫ్రికా దిగ్గజాలు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితమైంది. భారత్ 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. బిన్నీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. భారత బ్యాట్స్ మెన్ నమన్ ఓజా (21), సచిన్ (16), సురేశ్ రైనా (33), యువరాజ్ సింగ్ (6), యూసుఫ్ పఠాన్ (35 పరుగులు, 15 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) ఫర్వాలేదు. బౌలర్లలో రాహుల్ శర్మ 3 వికెట్లు తీయగా, మునాఫ్ పటేల్, ఓజా తలా 2, ఇర్ఫాన్ పఠాన్, యువరాజ్ తలో వికెట్ తీశారు.