ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ జిల్లాలో విషాదం జరిగింది. పంచాయితీ ఎన్నికల అభ్యర్థిగా ఉన్న మహిళ భర్త పంపిణీ చేసిన కల్తీ మద్యం తాగి 3 రోజుల వ్యవధిలో ఆరుగురు మరణించారు. దీనిపై హరిద్వార్ ఎస్పీ (రూరల్) పరమేంద్ర సింగ్ దోభాల్ స్పందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, అయితే అవి మద్యం సంబంధిత మరణాలా కాదా అని ఇంకా నిర్ధారణ కాలేదన్నారు. సర్పంచి అభ్యర్థి భర్తను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.