బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఈ వాయుగుండం పశ్చిమ-వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వివరించింది. ఉత్తరాంధ్రలో ఈరోజు అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి అని తెలిపారు.