ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 12, 2022, 11:15 AM

కమలాపురం మండలంలోని కంచన్నగారిపల్లెకు చెందిన ఇల్లూరు చంద్రఓబుల్ రెడ్డి (27) శనివారం సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై కొండారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చంద్రఓబుల్ రెడ్డికి వేంపల్లె మండలం నందిపల్లెకు చెందిన యువతితో ఏడు నెలల కిందట వివాహమైంది. ఈ క్రమంలో ప్రొద్దుటూరులో టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కొంత డబ్బు కావాలని తల్లిదండ్రులను చంద్రఓబుల్ రెడ్డి కోరడంతో అప్పులు ఎక్కువగా ఉన్నాయని సర్దుబాటు చేయలేమని చెప్పడంతో మనస్తాపానికి గురై శనివారం సాయంత్రం ఉరేసుకున్నాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు ఆదివారం పోలీసులకు సమాచారం అందించడంతో శవపరీక్ష నిమిత్తం కడప రిమ్స్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com