గుంటూరు: తెనాలి మండలం సంగం జాగర్లమూడి గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త గతంలోనే మృతిచెందారు. ఆమె గ్రామంలో తన ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటూ చుండూరులోని విద్యుత్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే వివాహితుడైన విజయవాడకు చెందిన తమ బంధువు తనను వేధిస్తున్నాడని, గతంలో చుండూరుకు కూడా వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడని, పెళ్లి చేసుకుందామంటూ మొబైల్ కి ఎస్ఎమ్ఎస్ లు పంపుతున్నాడని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.