అల్లూరి జిల్లా మన్యంలో అరకులోయ ప్రాంతంలో సోమవారం మంచు దోబూచులాడింది. సెప్టెంబర్ అక్టోబర్ డిసెంబర్ ఈ నెలలో మంచు తెరలను ఇక్కడి గిరిజనులను చుట్టేస్తాయి. కానీ ప్రస్తుత వర్షాల నేపథ్యంలో మన్యంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. అరకులోయ ప్రాంతంలో మూడు రోజులుగా వర్షాలు పడడంతో ఆకస్మాత్తుగా మంచు మేఘాలు పచ్చని కొండల్ని హిమ గిరులుగా మార్చేశాయి. ముందే పలకరిస్తున్న మంచు సోయగాలు మన్యానికి వచ్చే పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తున్నాయి.