చిత్తూరు, తిరుపతి: ప్రతి గ్రామంలోను జగనన్న స్పోర్ట్స్ క్లబ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, గ్రామీణ క్రీడలను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ను రూపొందించిందని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్, ప్రచార వాల్ పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పోర్ట్స్ క్లబ్స్ ఏర్పాటు కోసం ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్ పై మండల, గ్రామీణ స్థాయి అధికారులు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. గ్రామంలోని క్రీడాకారులను సంఘటిత పరిచే క్లబ్స్ ను ఏర్పాటు చేయాలన్నారు. మొబైల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకొని గ్రామీణ క్రీడలు నమోదు చేయగలిగితే గ్రామీణ క్రీడాకారుల ప్రతిభ తెలుస్తుందని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.