కాలుష్యం తదితర కారణాల వల్ల చాలా మందిలో చుండ్రు సమస్య కనిపిస్తుంది. చుండ్రు పోవాలంటే కొద్దిగా జీలకర్ర తీసుకొని మెత్తటి పేస్ట్‌లా చేసుకుని, దానిని కాకర రసంలో కలిపి మాడుకు రాసుకోవాలి. కొంతసేపు అలా దానిని ఆరనిచ్చి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేస్తే చుండ్రు సమస్యకు చెక్ పెట్టవచ్చు. కురుల విషయంలో తగినంత శ్రద్ధ తీసుకుని, పోషకాహారం తీసుకుంటే మంచిది.