ముప్పాళ్ళ మురుగునీరు వల్ల దోమలు వృద్ధి చెందుతాయని, అందుకే అందరూ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని పల్నాడు జిల్లా మలేరియా అధికారి కె. రవీంద్ర రత్నాకర్ చెప్పారు. మాధల గ్రామంలోని ఎస్సీ కాలనీలో సోమవారం దోమల నివారణ చర్యలు చేపట్టారు. కాలనీలో డెంగీ కేసు నమోదు కావటoతో ముందస్తు చర్యలలో భాగంగా నివాస ప్రాంతాల్లో నిల్వ ఉన్న మురుగునీటిని తొలగించారు. వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు.