సచివాలయ సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల నుంచి వచ్చే అర్జీలను తక్షణమే పరిష్కరించాలని బాపట్ల మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ తెలిపారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో పట్టణంలోని సచివాలయాల సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. సచివాలయాల ద్వారా ప్రజలకు అవసరమైన సేవలను వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. విధులలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.