తెనాలి రోడ్డు ప్రమాదంలో గాయపడిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలకు జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెక్కులు పంపిణీ చేశారు. సోమవారం తెనాలి జనసేన పార్టీ కార్యాలయం నందు ప్రమాదాల్లో గాయపడిన సుబ్బారావు 50 వేలు, తుపాకుల నాగబాబుకు 24 వేల రూపాయల చెక్కును ఆయన అందజేశారు. క్రియాశీలక కార్యకర్తలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.