పెద్దపప్పూరు: అంధురాలైన పెద్దక్క అనే మహిళను తోటలోకి తీసుకెళ్లి రాళ్లతో దాడిచేసి గాయపరిచిన సంఘటన సోమవారం పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట గ్రామంలో చోటుచేసుకుంది. ఆస్తి పంపకాల నేపథ్యంలో ఈ దాడి జరిగిందా? దాడి చేసినవారు ఆత్మీయులేనా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దాడిలో గాయపడిన పెద్దక్కను గ్రామస్థులు ఓ ప్రైవేటు వాహనంలో తొలుత తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి అనంతపురం తరలించారు. సోదరుడి కుటుంబ సభ్యులే దాడిచేసి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. పెద్దక్కను ఆమె సోదరుడి భార్య తోటవద్దకు తీసుకెళ్లిందని గ్రామస్థులు చర్చించుకుం టున్నారు. దీనిపై ఎస్ఐ ఖాజాహుస్సేన్ మాట్లాడుతూ. పెద్దక్కతో సోదరుడు, అతడి భార్య ఆస్తి కోసం గొడవపడినట్లు తెలిసిందని అన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి దాడికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.