అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు టౌన్ షాది ఖాన నందు మండల పార్టీ అధ్యక్షుడు జంగంశెట్టి సుబ్బయ్య, క్లస్టర్ ఇంచార్జీ పసుపులేటి ప్రవీణ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన "పోల్ మేనేజ్మెంట్" పై మండల విస్తృత స్థాయి సమావేశం సోమవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు మరియు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి గంటా నరహరి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ అన్ని రంగాలలోనూ నందలూరు మండలము ముందంజలో ఉందని అన్నారు.