ఒంగోలు: సీజనల్ వ్యాధుల పట్ల వైద్యశాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి నియంత్రించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ ఛాంబర్ లో గురువారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ దినేష్ కుమార్ వ్యాధులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య చర్యలు చేపట్టాలన్నారు. అలాగే గృహాల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని ఆదేశించారు.