పల్నాడు: పెళ్లైన 16 రోజులకే భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో బుధవారం జరిగింది. వినయ్, అఖిల ప్రేమించుకున్నారు. వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. తరువాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఈ నెల 12న కట్నం విషయంలో పంచాయతీ జరగ్గా, మనస్తాపంతో అఖిల, వినయ్‌లు ఉరివేసుకున్నారు. అఖిల చనిపోగా, వినయ్ పరిస్థితి విషమంగా ఉంది.